Header Banner

హద్దులు దాటిన సెలబ్రేషన్.. గుండు కొట్టించి వీధుల్లో ఊరేగించిన పోలీసులు.!

  Wed Mar 12, 2025 11:22        India

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు గెలవడంతో దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో జరిగిన వేడుకలు కాస్త శ్రుతి మించాయి. రాత్రిపూట రోడ్లపై టపాసులు కాలుస్తూ యువత కేరింతలు కొట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. జనం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వెళ్లిపోతుంటే వాహనాన్ని ఛేజ్ చేశారు. వెనుక పరిగెత్తుతూ రాళ్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు యువకులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు.

 

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

ఈ చట్టం కింద నిందితులను 12 నెలల వరకు నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆపై అదుపులోకి తీసుకున్న యువకులకు గుండు కొట్టించి, వీధుల్లో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. యువకులకు గుండు కొట్టించి ఊరేగించిన ఘటనపై బాధితుల తల్లిదండ్రులు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజెను ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న యువకులపై ఇలాంటి తీవ్రమైన కేసులు పెట్టడం, గుండు కొట్టించి ఊరేగించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. వాళ్లేమీ సాధారణ నేరస్థులు కారని గుర్తుచేశారు. వేడుకల్లో కొంత అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, దానికి మందలించాలే కానీ ఇలా ఘోరంగా అవమానించడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MadhyaPradesh #Youth #ParadedPolice #CricketCelebrations #ViralVideos